టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ అంటే ఒకప్పుడు ఒక రకమైన ఇమేజ్ ఉండేది. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు.. ఎదుటివారు ఎవరనేది చూడకుండా తనదైన శైలిలో దూకుడుగా సమాధానాలు చెప్పేవారు. ఈ క్రమంలోనే ఆయనపై ‘యారోగెంట్’ అనే ముద్ర కూడా పడింది. అయితే అదంతా ఒకప్పుడు. విశ్వక్ గత చిత్రం లైలా డిజాస్టర్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు విశ్వక్. తన బాడీ షేప్ తో పాటు ప్రవర్తనలోను సరికొత్త మేకోవర్ తో ఇప్పడు ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
Also Read : Kidnap Case : మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ.. అరెస్ట్ తప్పదా?
నిన్న జరిగిన ఫంకీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఒకప్పుడు విశ్వక్ అంటే చాలా దూకుడుగా ఉండేవాడు, మైక్ ఇస్తే అందరినీ తన మాటలతో తిట్టేసే యారోగెంట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న విశ్వక్ సేన్ పూర్తిగా వేరు. కానీ ఇప్పుడు విశ్వక్ ని చూస్తే ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ కేవీ అనుదీప్ లా కనిపితున్నాడు కదా, అనుదీప్ ఎంత అమాయకంగా, సరదాగా నవ్విస్తూ ఉంటారో.. విశ్వక్ కూడా ఇప్పుడు అందరినీ నవ్విస్తూ, ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారని’ అన్నాడు. తన కొత్త సినిమాల ప్రమోషన్లలో విశ్వక్ చూపిస్తున్న ఈ కొత్త వేరియేషన్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామం విశ్వక్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కయాడు లోహర్ హీరోయిన్ గా విశ్వక్ హీరోగా వస్తున్న ఫంకీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.