Thandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “తండేల్”. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రం, రిలీజ్ అయిన ఆ అంచనాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించి, నాగ చైతన్య కెరీర్‌లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.
బుకింగ్స్‌లో దుమ్ము రేపుతున్న “తండేల్”
ఈ చిత్రం టికెట్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ “బుక్ మై షో”లో ఇప్పటివరకు 7 లక్షలకుపైగా టికెట్ బుకింగ్స్ నమోదయ్యాయి. సినిమా విడుదలై మూడు రోజులు పూర్తికాకముందే ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం విశేషం. ఈ ట్రెండ్‌ను బట్టి త్వరలోనే “తండేల్” బుక్ మై షోలో 1 మిలియన్ బుకింగ్స్” మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also:Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…
నాగ చైతన్య మాస్ అప్పీల్
ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే హైప్ క్రియేట్ చేయగా, నాగ చైతన్య నటన, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, చందూ మొండేటి టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. పైగా, దేశవ్యాప్తంగా “తండేల్” పై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా కథ, నాగ చైతన్య మాస్ లుక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.
బ్లాక్‌బస్టర్ హిట్ దిశగా “తండేల్”
నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు చాలా విజయవంతమైన సినిమాలు ఉన్నాయి, కానీ “తండేల్” మాత్రం మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. టికెట్ బుకింగ్స్ పరంగా ఇదే జోరు కొనసాగితే, ఈ మూవీ వచ్చే రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశముంది. ఇప్పటికే వీకెండ్ కలెక్షన్లతో నాగ చైతన్య తన సత్తా చాటినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా, గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం చేపట్టారు. విడుదలైన ప్రతి చోట కూడా “తండేల్” హవా కొనసాగుతుండటంతో, సినిమా బాక్సాఫీస్ రన్ మరింత పటిష్టంగా సాగనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Also:Hyderabad: చిలుకూరు ప్రధాన అర్చకుడి ఇంటిపై 20 మంది దాడి.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
A tsunami of love for #Thandel 🌊🔥
Massive 700K+ tickets booked only on BookMyShow.
With SUPER STRONG WOM & TERRIFIC WALKINS, Sunday is all set for a big day.
Book your tickets for #Thandel now!
🎟️ https://t.co/5Tlp0WNszJ#BlockbusterLoveTsnuami pic.twitter.com/ggPILUMcNu— Thandel (@ThandelTheMovie) February 9, 2025