భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్‌లో జరుగుతున్న రెండో ఓడీఐలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఓడీఐలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.