స్టోక్స్ మనసులో మాట.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్‌గా భావించిన గ్రూప్-1లో సెమీస్‌కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్ టీమ్.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. 19వ ఓవర్లో అసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు కొట్టి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.
Read Also: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ నేపథ్యంలో అసిఫ్ అలీపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. ఈ పేరును గుర్తుపెట్టుకోండి అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్యే జరగబోతుందని జోస్యం చెప్పాడు. ఇప్పటివరకైతే గ్రూప్-1లో ఇంగ్లండ్ టాప్‌లో ఉండగా.. గ్రూప్-2లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే స్టోక్స్ ఇంగ్లండ్ ఆటగాడు కాబట్టి అలా చెప్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిందని గుర్తుచేస్తున్నారు. ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
England vs Pakistan Final ???
— Ben Stokes (@benstokes38) October 29, 2021
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!