వరంగల్ జిల్లాలోని నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని రక్షిత ఆత్మహత్యకు పాల్పడింది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతులకు చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట లోని జయముఖీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది రక్షిత. అయితే.. ఓ విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో మనస్థాపానికి గురైన రక్షిత రెండు రోజులుగా ఇంటి నుండి కనిపించకుండా బయటకు వెళ్లిపోయింది రక్షిత.
Also Read : Halari Donkey: గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం.. గొప్ప కారణమే ఉందండోయ్ !
రెండు రోజుల క్రితం రక్షితపై భూపాలపల్లిలో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. అయితే.. రెండు రోజుల తర్వాత రక్షిత ఆచూకీ తెలియడంతో వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంటి దగ్గర ఉంచారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే.. వరంగల్ రామన్నపేటలో తన బంధువుల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది రక్షిత. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు రక్షితం ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం అని అనుమానిస్తున్నారు.
Also Read : Delhi High Court: అగ్నిపథ్ స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత