Halari Donkey: గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం.. గొప్ప కారణమే ఉందండోయ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Halari Donkey: గర్భిణీలకు సీమంతాలు చేయడం, అప్పుడే పుట్టిన చిన్నారులకు బారసాల నిర్వహించడం సాధారణమే. కానీ గర్భం దాల్చిన గాడిదలకు సీమంతాలు నిర్వహించడం, గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమేనండోయ్.. ఎక్కడో తెలుసా?. దీని వెనుక గొప్ప కారణమే ఉందండోయ్. అంతరించిపోయే జాబితాలో ఉన్న హలరీ జాతి గాడిదలను రక్షించేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రజలు కృషి చేస్తు్న్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు అక్కడి ప్రజలు రకరకాలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే పిల్లలకు ఎలా శుభకార్యాలు చేస్తారో.. అలాగే అప్పుడే పుట్టిన గాడిద పిల్లకు బారసాల, గర్భం దాల్చిన గాడిదకు సీమంతం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకా కోల్కి గ్రామంలో ఓ ఆడ గాడిద మరో పిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఈ బిడ్డ పుట్టడం వల్ల అక్కడి ప్రజలు ఆనందంలో సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని పశువుల కాపరులు, ప్రజలు ఆ బిడ్డకు బారసాల వేడుకతో పాటు గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. మనుషులకు చేసిన విధంగానే, వారంతా కలిసి ఆ పిల్లను శుభ్రం చేసి అందంగా అలంకరించారు. దీంతో పాటుగా గర్భం దాల్చిన గాడిదలకు నుదుటిన ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు. ఆ తర్వాత మహిళలు అనేక పూజలు చేసి.. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించారు. ఈ వేడుకలను తిలకించేందుకు గ్రామస్థులు, జంతుప్రేమికులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఆనందంతో మిఠాయి తినిపించుకున్నారు. ప్రస్తుతం హలరీ గాడిదల సంఖ్య సుమారు 417 మాత్రమే ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?