Engineering Seat Allotment: ఇంజనీరింగ్ అడ్మిషన్స్.. మొదటి విడత సీట్ల కేటాయింపు
- ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
- కన్వీనర్ కోటాలో 78694 సీట్లు ఉండగా 75200 సీట్లు కేటాయింపు
- కంప్యూటర్ సైన్స్.. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో..
- 53890 సీట్లు ఉంటే 53517 సీట్లు కేటాయింపు
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 16344 సీట్లు ఉంటే 15127 సీట్లు కేటాయింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు. అంటే.. 99.31 శాతం సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో16, 344 సీట్లు ఉంటే 15, 127 సీట్లు కేటాయించారు. అంటే.. 92.55 శాతం సీట్లు కేటాయించారు.
Read Also: Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
సివిల్, మెకానికల్ కోర్సుల్లో7, 339 సీట్లు ఉంటే 5, 689 సీట్లు కేటాయించారు. అంటే.. 77.52 శాతం కేటాయించారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకు విద్యార్థులు జై కొట్టారు. అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులను కూడా విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. గతంతో పోల్చుకుంటే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా సంఖ్య పెరిగింది.
జెండర్ వైస్, కేటగిరీ వైస్ సీట్లు అలాట్మెంట్ డీటెయిల్స్
ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయినవారిలో 41,308(55 శాతం) బాయ్స్, 33,892 (45 శాతం) గర్ల్స్ ఉన్నారు.
ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయిన వారిలో 20.4 శాతం ఓసీ(oc)లు, 52.6 శాతం బీసీలు, ఎస్సీలు 16.8 శాతం, ఎస్టీ లు 10.2 శాతం ఉన్నారు.
Read Also: Allu Family Vs Mega Family: అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం.. మెగా ఫ్యామిలీతో వివాదంలో నిజమిదే!
తెలంగాణ ఈఏపీసెట్ 2024 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమైంది. జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరయ్యారు. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 19వ తేదీ తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం.. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుంది. అలాగే.. చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!