Ashes 2023: అలెక్స్ కేరీకి షూస్ చూపించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మంచి రంజు మీద సాగుతుంది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా ఆసీస్ సారథి కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి ఇంగ్లండ్ టీమ్ పతనం శాసించాడు. ప్రస్తుతం ఇంగ్లీస్ జట్టు రెండో సెషన్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో గేమ్ కొనసాగిస్తుంది. బెన్ స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. ప్యాట్ కమిన్స్ ఆరు వికెట్లతో రెచ్చిపోయాడు. స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు చేయాల్సి ఉంది.
Read Also: Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్ మైదానం జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్.. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు.
Read Also: Chandrababu: సీఎం గ్రాఫ్ పడిపోయింది.. పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం..!
ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీ ఔటయి పెవిలియన్ కు వెళ్తున్న టైంలో ఇంగ్లండ్ ఫ్యాన్స్ అతన్ని గేలి చేస్తూ.. గుడ్ బై.. ఇక గ్రౌండ్ లోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు అయితే మరి ఓవరాక్షన్ గా షూస్ విప్పి చేతిలో పట్టుకొని అలెక్స్ కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త ధీటుగానే రియాక్ట్ అవుతున్నారు.
Read Also: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ 193/5గా ఉన్న టైంలో గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు సాగాడు.. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని స్టంప్స్ పైకి విసిరాడు. దీంతో థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారి తీసింది. అందులో భాగంగానే అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానులు షూస్ చూపించారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!