Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సోమవారం జార్ఖండ్‌లో నోట్ల కట్టల డంప్ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. ఓ మంత్రి సహాయకుడి ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. కొన్ని గంటల పాటు అధికారులు మిషన్లలో లెక్కిస్తే.. దాదాపు రూ.37 కోట్లు బయటపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఇంత మొత్తంలో నగదు పట్టుబడడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మూడో సారి అధికారంలోకి వచ్చాక.. నల్లధనాన్ని బయటకు తీస్తామని ప్రకటించారు.
ఈ నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నగదు పట్టుబడడంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద మే 6వ తేదీన రాంచీలో ఈడీ దాడులు నిర్వహించింది. సంజీవ్ లాల్ డొమిస్టిక్ హెల్ప్ జహంగీర్ ఇంట్లో లెక్కల్లో చూపించని రూ.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ ఇద్దరినీ పీఎంఎల్ఏ కింద అరెస్టు చేయడంతో కోర్టు వారిని ఆరు రోజుల కస్టడీకి పంపింది. కాగా.. కాంగ్రెస్ కోటా నుంచి జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలంగీర్ ఆలమ్ ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?