Petrol Diesel Price: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రాబోయే రెండేళ్లలో తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కానీ ఐదేళ్ల సగటు ధరతో పోలిస్తే మాత్రం ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. ప్రపంచంలోని చాలా దేశాల కరెన్సీ విలువలు క్షీణించడంతో ధరలు తగ్గినప్పటికీ దిగుమతులు భారంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
Read AlsoFlash Light Eye: ఫ్లాష్ లైట్‌గా మారిన కన్ను.. కళ్లు చెదిరే ఆవిష్కరణ అంటే ఇదే కావొచ్చు:
ఫలితంగా ఇందన ఆహార సంక్షోహం తలెత్తుతుందని చెప్పింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించడం కూడా చమురు ధరలు దిగిరావడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. 2023లో చమురు ధరలు 11శాతం, 2024లో 12శాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ ఓనివేదికలో తెలిపింది. ఈ ప్రకారం బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 2023లో 92డాలర్ల వద్ద, 2024లో 80డాలర్ల వద్ద ఉండనున్నట్లు పేర్కొంది.
Read Also: Russia Ukraine War: చస్తే చస్తాం మళ్లీ తిరిగిరాం.. స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్
గత ఐదేళ్ల సగటు ధర 60డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువేనని తెలిపింది. నేచురల్ గ్యాస్, బొగ్గు ధరలు సైతం 2023లో తగ్గుతాయని పేర్కొంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటూ ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. మరో వైపు అధిక చమురు ధరల వల్ల ఆహారధాన్యాలు, వంట నూనెల రేట్లు పెరుగుతాయని అంచనావేసింది. అలాగే ప్రతికూల వాతావరణం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సైతం తగ్గుతాయని తెలిపింది.