‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా వస్తోంది ఈ సీనియా. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక కీలక పాత్రలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు.
Also Read : Pradeep : ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ సినిమాతో రామ్ రైటర్ గా కూడా అవతారం ఎత్తాడు. ఈ సినిమాలో ఓ ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడు. కాగా ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు మేకర్స్. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 15న రానుంది. అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. సున్నితమైన వినోదంతో పాటు మనసును హత్తుకునే కథాంశంతో యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఈగర్ ఇస్తాడనిఎదురు చేస్తున్నారు రాపో ఫ్యాన్స్.