గిగ్లైజ్ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదని బాధిత నిరుద్యోగులు, జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగులు ఎన్టీవీతో చెప్పారు. నిరుద్యోగులు అందరం జాగృతి కన్సల్టెన్సీ, SLC కన్సల్టెన్సీ వెంకట్కి ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టామని తెలిపారు. చాలా మంది వద్ద రూ. 2 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు.. కన్సల్టెన్సీల నుండి కోట్ల రూపాయలు దండుకుని ఉద్యోగం కల్పిస్తామని చెప్పి గిగ్లైజ్ కంపెనీ సీఈవో రవిచంద్ర రెడ్డి బోర్డు తిప్పేసారని వారు ఆరోపిస్తున్నారు.