Pottel :టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ప్రియా దర్శి హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ఈ సినిమా తరువాత అనన్య నాగళ్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “వకీల్ సాబ్ ” మూవీలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాలో అనన్య అద్భుతంగా నటించింది.ఈ సినిమా తరువాత అనన్య వరుస సినిమాలలో ఆఫర్స్ అందుకుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తు హీరోయిన్ గా నటించింది.ఈ భామ హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ తో పాటు,పెర్ఫార్మన్స్ రోల్స్ కూడా చేస్తూ అదరగొడుతుంది.రీసెంట్ గా ఈ భామ “తంత్ర” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తాంత్రిక శక్తులు వున్న అమ్మాయిగా ఈ సినిమాలో అనన్య అద్భుతంగా నటించింది.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
Read Also :Thalapathy 69 : కార్తీక్ సుబ్బరాజు మూవీ కోసం విజయ్ భారీ రెమ్యూనరేషన్..?
ఇదిలా ఉంటే ఈ భామ నటిస్తున్న మరో కంటెంట్ బేస్డ్ మూవీ “పొట్టెల్ “.ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సాహేత్ మోత్కురి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా “బుజ్జి మేక” అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.కాసర్ల శ్యాం రాసిన ఈ పాటను కాల భైరవ ఆలపించారు.ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.ఎమోషనల్ సాగుతున్న ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలువనుందని మేకర్స్ తెలిపారు.
An Emotion-Stirring Musical Piece ✨️
The endearing #BujjiMeka Lyrical Video from #Pottel out now ❤️
🎙@KaalaBhairava7
🎶 #ShekarChandra
✍️ @LyricsShyam🎬 by @MothkuriSaahith
💰 by @nishankreddy17 @SureshKSadige
@YuvaChandraa @AnanyaNagalla pic.twitter.com/ap2FLrsH5n— POTTEL THE MOVIE (@PottelTheMovie) June 21, 2024