Thalapathy 69 :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ దశ లో ఉండగానే విజయ్ మరో సినిమాను మొదలు పెట్టారు.
Read Also :Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా విజయ్ దళపతి 69 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం విజయ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 275 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ వైరల్ అవుతుంది.కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తుంది.కార్తీక్ సుబ్బరాజు ప్రస్తుతం సూర్య హీరోగా ‘సూర్య 44 ‘ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.