Elvish Yadav Case: రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్, బిగ్ బాస్ 2 (OTT) విన్నర్ ఎల్విష్ యాదవ్ కు నోయిడా పోలీసులు మంగళవారం (నవంబర్7) నోటీసులు జారీ చేశారు. ఎల్విష్ యాదవ్ కు నోటీసులతో పాటు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఇటీవల నోయిడా పోలీసులు కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పాము విషం సరఫరా కేసులో ఎల్విస్ ప్రమేయం ఉన్నట్లు ఓ ఎన్జీవోకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎల్విష్ యాదవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also:Election Commission: ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు రంగుపడుద్ది..
ఈ క్రమంలోనే నేడు ఎల్విష్ యాదవ్ సెక్టార్ -20 పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. అంతకుముందు, నోయిడా పోలీసులు ఎల్విష్‌కు విచారణ కోసం నోటీసు పంపారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. దీని తరువాత ఎల్విష్ వెళ్ళడానికి అనుమతించబడింది. అయితే బుధవారం ఎల్విష్‌ను మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నారు. ఎల్విష్ యాదవ్ తన సహచరులతో మంగళవారం అర్థరాత్రి సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఏయే ప్రదేశాల్లో పార్టీలు జరిగాయి, పాము విషం, ప్రదర్శనతో పాటు ఎల్విష్ యాదవ్‌ను దాదాపు 15 నుండి 20 ప్రశ్నలు అడిగారని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణలో ఎల్వీష్ యాదవ్ చాలా భయపడ్డాడని, తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Also:Manchu Vishnu: రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా కన్నప్ప!
ఎల్విష్ యాదవ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులను ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించవచ్చు. అంతేకాకుండా ఎల్వీష్ యాదవ్ నుంచి వచ్చిన మరికొన్ని ప్రశ్నలకు కూడా పోలీసులు సమాధానాలు తెలుసుకోవాలన్నారు. ఈ విచారణ తర్వాత పాము బాధితులు, ఎల్విష్ యాదవ్‌కు ఎక్కడ పరిచయం ఏర్పడింది. ఎన్నిసార్లు, ఏయే ప్రదేశాలలో పార్టీలు జరిగాయి. దీనికి ముందు అధికారులు ఇప్పటికే పాములు పట్టేవారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఇప్పుడు అన్ని స్టేట్‌మెంట్‌లను అనుసంధానించే దిశగా పోలీసులు పని చేస్తారు.