Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP and Jana Sena Eye on Eluru Mayor Seat: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అధికార కూటమిలోని జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. మేయర్ పదవి తమకే దక్కాలంటూ ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఏలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేనకు ఏలూరు మేయర్ కేటాయిస్తారనే ఊహాగానాలతో.. రంగంలో దిగిన టీడీపీ నేతలు తమ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏలూరు మెయిన్ పీఠం ఎవరికి దక్కుతుందని అంశంపై ఆసక్తి కొనసాగుతోంది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీల నిర్ణయాలను పరిశీలించిన అనంతరం అభ్యర్థి ఎంపికపై వైసీపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేయర్ పదవికి సంబంధించి టీడీపీ, జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? లేదా చివరి వరకు పోటీ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఏలూరు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
మరోవైపు ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూడా పోటీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. పెదవేగి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి తన పేరును పరిశీలించాలని కోరుతూ టీడీపీ ఎన్నికల పరిశీలకురాలు పంచుమర్తి అనురాధకు నవ్యశ్రీ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు సమాచారం. జెడ్పీటీసీగా ఎన్నికై, అనంతరం చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆమె రాజకీయంగా ముందడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవైపు మేయర్ పీఠం కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ.. మరోవైపు జడ్పీ చైర్మన్ పదవిపై ఆశావహుల ప్రయత్నాలతో ఏలూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!