Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పిల్లల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా వెల్లడించారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను ఒక ఎక్స్ ఖాతాదారు షేర్ చేయగా, దానికి స్పందించిన మస్క్ వారి పూర్తి పేర్లు, వాటికి ప్రేరణ ఏమిటో వివరించారు. తన కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ అని మస్క్ తెలిపారు. ఇందులో ‘స్ట్రైడర్’ పేరు ప్రముఖ రచయిత జె.ఆర్.ఆర్. టోల్‌కీన్ రాసిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథలోని పాత్ర అరగోర్న్ నుంచి తీసుకున్నదని చెప్పారు. ఆ పాత్ర మొదట ‘స్ట్రైడర్’ అనే పేరుతోనే పరిచయం అవుతుంది. ఇక ‘శేఖర్’ అనే పేరు భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు గౌరవంగా పెట్టినదని తెలిపారు. చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
READ MORE: Tragedy: ఘోర ప్రమాదం.. సిమెంట్ ట్యాంకర్ ను ఢీకొన్న డీసీఎం.. ముగ్గురు మృతి
తన కుమార్తె పేరు కామెట్ అజ్యూర్ అని, అది ‘ఎల్డెన్ రింగ్’ అనే వీడియో గేమ్‌లో అత్యంత శక్తివంతమైన మంత్రం పేరు నుంచి తీసుకున్నదని మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో స్వయంగా పోస్ట్ చేశారు. స్ట్రైడర్ శేఖర్, కామెట్ అజ్యూర్‌లు 2021 నవంబర్‌లో ఎలాన్ మస్క్, న్యూరాలింక్ సంస్థలోని శివోన్ జిలిస్‌కు జన్మించారు. వీరికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆర్కేడియా 2024లో జన్మించగా, సెల్డన్ లైకర్గస్ 2025 మార్చిలో పుట్టాడు. శివోన్ జిలిస్ తల్లి శార్దా జిలిస్ పంజాబీ భారతీయురాలు కావడంతో ఆమెకు భారతీయ వారసత్వం ఉంది.
READ MORE: Trump: అలా చేస్తే ఊరుకోం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇదిలా ఉండగా.. మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌పై యూరోప్‌లో విచారణ కొనసాగుతోంది. అలాగే ఎక్స్‌లోని ఏఐ అసిస్టెంట్ ‘గ్రోక్’ అనుచితమైన, అసభ్య కంటెంట్ తయారు చేస్తోందన్న ఆరోపణలతో యూరోప్, భారత్, మలేషియా దేశాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. భారత్‌లో గ్రోక్ తయారు చేసిన అసభ్య కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఎక్స్‌ను ఆదేశించింది. ఈ ఆరోపణలపై స్పందించిన మస్క్, చట్టవిరుద్ధమైన కంటెంట్ తయారు చేసినా లేదా అప్‌లోడ్ చేసినా, చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.