Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పిల్లల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా వెల్లడించారు. తన పిల్లలతో ఉన్న ఫోటోను ఒక ఎక్స్ ఖాతాదారు షేర్ చేయగా, దానికి స్పందించిన మస్క్ వారి పూర్తి పేర్లు, వాటికి ప్రేరణ ఏమిటో వివరించారు. తన కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ అని మస్క్ తెలిపారు. ఇందులో ‘స్ట్రైడర్’ పేరు ప్రముఖ రచయిత జె.ఆర్.ఆర్. టోల్‌కీన్ రాసిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథలోని…