మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ట్యాంకర్ ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. డీసీఎంలో ఉన్న టైల్స్ కూలీల మీద పడడంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం లో టైల్స్ ను హైదరాబాదు నుండి గుంటూరుకు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
Also Read:Off The Record: ఆ మాజీ మంత్రి పొలిటికల్ కెరీర్కు ఇక ఎండ్ కార్డు పడినట్టేనా..?
మరో ఘటనలో.. కామారెడ్డి పాత జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు లింగంపేట్ మండలం సూరయపల్లి వాసులుగా గుర్తించారు. బిక్కునూరు మండలం అంతంపల్లిలో పొలంపనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.