Ellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బలగం’ సినిమాతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథాంశం మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ను హీరోగా పరిచయం చేస్తున్నారు వేణు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఎల్లమ్మ దేవత చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ సినిమా కోసం వేణు ఏకంగా 8 గంటల పాటు కథను వివరించగా, అందులోని ఇంటెన్సిటీ నచ్చి డిఎస్పీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా విడుదలైన చిన్న టీజర్ గమనిస్తే, ఇందులో డిఎస్పీ ‘పర్శి’ అనే మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టేలా కనిపిస్తున్నారు.
Also Read : AR Rahman: తండ్రి కోసం రంగంలోకి అమీన్.. మోదీ ప్రశంసించిన వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్!
Also Read
ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే, ఇందులో రెగ్యులర్ హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరట. కథ మొత్తం అమ్మవారి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. కానీ ఆ ‘ఎల్లమ్మ’ దేవత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ దేవతగా కనిపిస్తే, ఆమె భక్తుడిగా దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్‌తో చర్చలు జరుగుతున్నాయి, ఆమె ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ సెంటిమెంట్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి వేణు ఈ సినిమాను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!