‘బలగం’ సినిమాతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథాంశం మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ను హీరోగా పరిచయం చేస్తున్నారు వేణు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఎల్లమ్మ దేవత చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ సినిమా కోసం…