ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తుందన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏ మాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక దుయ్యబట్టింది. ప్రజలకు అబద్ధాలు చెప్పడం, తప్పుదారిపట్టించడం, వారిని భయపెట్టడం వంటి స్థాయికి బీజేపీ నేతలు దిగజారిందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విమర్శించారు.
ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ పోటీ చేసే లోక్‌సభ స్థానం ఇదే!
కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిండం వంటి అంశాలపై దృష్టి సారించి ఉంటే ఈరోజు వేదకలపై ఇతర అంశాలు ప్రస్తావించాల్సిన అవసరమే వచ్చేది కాదని ప్రియాంక అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికలు తమకు అనుకూలం లేవని బీజేపీ నేతలు గ్రహించినందునే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం, దాడులు సాగిస్తున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Veera Shiva Reddy: కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రేపే వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే
ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతల ప్రవర్తన చూసినప్పుడు ఎన్నికలు తమకు అనుకూలంగా లేవని వారు గ్రహించినట్టు కనిపిస్తోందన్నారు. వారంతో నిరాశానిస్పృహలతో కనిపిస్తున్నారని తెలిపారు. అందుకే అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఉంటే ఈరోజు వేదికలపై అసంబద్ధమైన ప్రస్తావనలు వచ్చేవి కావని తెలిపారు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారన్నారు. అవేవీ ప్రజలకు ఉపయోగపడేవి కావని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పోటీ చేస్తు్న్న వయనాడ్‌లో బుధవారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఏప్రిల్ 26న కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందని ఎన్నికల ర్యాలీలో ప్రియాంక అన్నారు. కుటుంబపాలన అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ఈ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని గుర్తుచేశారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు సిగ్గులేని వ్యా్ఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.