పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుంది. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు. మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ…