Site icon NTV Telugu

AP Elections 2024: ఏపీలో నేటితో ప్రచారానికి తెర..

Ap Elections

Ap Elections

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు.. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా మైక్‌లు మూగబోనున్నాయి.. ఇక, ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించడం, ప్రసారం చేయడంపై కూడా నిషేధం ఉంటుంది.. ప్రచారాలు ముగిసిన సమయం నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది..

Read Also: Karnataka S*x Scandal Case: కర్ణాటక సె*క్స్ స్కాండల్ కేసులో బీజేపీ నేత అరెస్ట్

మరోవైపు.. పోలింగ్‌ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు మీనా.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా.. ఇక సైలెంట్‌గా ప్రలోభాలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయి.. ఇక, పోలింగ్‌ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డేగా ప్రకటించారు.. ప్రచార పర్వం ముగియగానే.. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన నేతలు, వివిధ పార్టీల శ్రేణులు.. ఆయా నియోజకవర్గాలను వీడాల్సి ఉంటుంది.. మరోవైపు.. ఎన్నికల్లో ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఏ అభ్యర్థి అయినా.. ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే.. మాకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు.

Exit mobile version