పోషక విలువలు కలిగిన గుడ్లను రోజు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు మండిపోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాల విధించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్‌కు గుడ్లు తలనొప్పిని పెంచాయి. ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న…