PM Modi: భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ మనకు అవసరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ ప్రస్తుతం మనకు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఆయన స్వస్థలమైన టంకారాలో నిర్వహించిన వేడుకను ఉద్దేశించి ఆదివారం నాడు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.
Read Also: Revenue Employees Pen Down: ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్..
Also Read
ఈ సందర్భంగా భారతీయ విలువల బోధనకు కేంద్రంగా ఆర్యసమాజ్ పాఠశాలలు నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. బానిసత్వం, మూఢనమ్మకాలతో దేశం కునారిల్లుతున్న కాలంలో జన్మించిన దయానంద సరస్వతి.. వాటి వల్ల శాస్త్రీయ ఆలోచనలు ఎలా బలహీనపడుతున్నాయో తెలియజెప్పి చైతన్యం కలిగించారని ఆయన గుర్తు చేశారు. వేదాలకు తార్కిక వివరణలు ఇచ్చి, వాటి గొప్పతనాన్ని ఆయన తెలియజేశారన్నారు. భారతీయ తత్వమంటే ఏమిటో బ్రిటిష్ పాలకులకు చాటి చెప్పారని ప్రధాని తెలిపారు. ఎంతో మందిని ఆర్య సమాజం ప్రభావితం చేసిందని ఆయన తెలిపారు. దయానంద సరస్వతి జన్మించిన రాష్ట్రంలో తాను పుట్టడం, ఆయన కర్మభూమిగా భావించే హరియాణా గురించి బాగా తెలుసుకోవడం వల్ల తన జీవితంపై ఆయన ప్రభావమెంతో ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!