మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. నగదు లెక్కింపు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపడుతున్నారు.. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఈడీ అదుపులోకి తీసుకుంది. కళ్యాణ్ ఇంట్లో సోదాలు అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తోకలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. రూ. 700 కోట్లు స్కామ్ జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారు. ఈడీ కార్యాలయంలో కళ్యాణ్‌ను ప్రస్తుతం విచారిస్తున్నారు.
READ MORE: Daya Nayak: 84 ఎన్కౌంటర్లు..! ముంబైని వణికించిన ఏసీపీ.. రిటైర్మెంట్కు 48 గంటల ముందు పదోన్నతి..
ఇదిలా ఉండగా.. 2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రజలకు సుమారు రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(ACB) తన దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.