స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు.