NTV Telugu Site icon

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీల జాతీయ గుర్తింపు రద్దు.. బీఆర్‌ఎస్‌కు షాక్‌

Ec

Ec

దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల గుర్తింపుల్లో మార్పులు చేర్పులు చేసింది భారత ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని జాతీయ పార్టీగా గుర్తించింది మరియు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ), ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), మణిపూర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్, పుదుచ్చేరిలోని పట్టాలి మక్కల్ కట్చి, పశ్చిమ బెంగాల్‌లోని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మిజోరంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇచ్చిన రాష్ట్ర పార్టీ హోదాను కూడా ఈసీ తొలగించింది. అయితే.. “ఎన్నికల గుర్తు” (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం “ఈసీ” తాజా నిర్ణయం తీసుకుంది.

Also Read : Off The Record: వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుక్కుపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరు..?

రాష్ట్ర పార్టీగా గుర్తింపు కోసం ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు లేదా మొత్తం అసెంబ్లీ సీట్లలో 3 శాతం సీట్లు లేదా 25 ఎంపీ సీట్లకు ఒక సీటైనా గెలిచి ఉండాలి. అలాగే, పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లైనా వచ్చి ఉండాలి. ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని “బీఆర్ఎస్”. అందుకే, ఆ రాష్ట్రంలో “బీఆర్ఎస్‌”కు రాష్ట్ర పార్టీ గుర్తింపు రద్దు చేసింది ఈసీ. కేవలం తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తూ “ఈసీ” ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Off The Record: విశాఖ తూర్పులో ఏం జరుగుతోంది.? వైసీపీ అక్కడే ఎందుకు ఫోకస్ పెట్టింది.?