Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీల జాతీయ గుర్తింపు రద్దు.. బీఆర్ఎస్కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల గుర్తింపుల్లో మార్పులు చేర్పులు చేసింది భారత ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని జాతీయ పార్టీగా గుర్తించింది మరియు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మణిపూర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్, పుదుచ్చేరిలోని పట్టాలి మక్కల్ కట్చి, పశ్చిమ బెంగాల్‌లోని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మిజోరంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇచ్చిన రాష్ట్ర పార్టీ హోదాను కూడా ఈసీ తొలగించింది. అయితే.. “ఎన్నికల గుర్తు” (రిజర్వేషన్ & అలాంట్మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం “ఈసీ” తాజా నిర్ణయం తీసుకుంది.
Also Read : Off The Record: వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుక్కుపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరు..?
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
రాష్ట్ర పార్టీగా గుర్తింపు కోసం ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు లేదా మొత్తం అసెంబ్లీ సీట్లలో 3 శాతం సీట్లు లేదా 25 ఎంపీ సీట్లకు ఒక సీటైనా గెలిచి ఉండాలి. అలాగే, పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లైనా వచ్చి ఉండాలి. ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని “బీఆర్ఎస్”. అందుకే, ఆ రాష్ట్రంలో “బీఆర్ఎస్”కు రాష్ట్ర పార్టీ గుర్తింపు రద్దు చేసింది ఈసీ. కేవలం తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తూ “ఈసీ” ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Off The Record: విశాఖ తూర్పులో ఏం జరుగుతోంది.? వైసీపీ అక్కడే ఎందుకు ఫోకస్ పెట్టింది.?
- Tags
- AAP
- big news
- breaking news
- BRS
- cpi
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!