Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. ఐదు రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి. సాయంత్రం 6:09 గంటలకు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాలు సంభవించే ప్రదేశం. అంతకుముందు జూలై 23న ఇక్కడ భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం సాయంత్రం 6:09 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
Also Read: Assam Congress Chief: ‘మహాభారతంలో లవ్ జిహాద్’ వ్యాఖ్యలపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
అంతకుముందు ఆదివారం, 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 165 కి.మీ. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఉదయం 8.46 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.