E-Challan Scam: ఏపీ ఈ-చలాన్‌ల డబ్బును మాయం చేశారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు వెల్లడించారు. డీజీ అకౌంట్‌కు అనేక రకాల రూపాలలో ఈ- డేటా చలానాకు సంబంధించిన డబ్బులు వస్తాయని.. డీజీ అకౌంట్స్ ద్వారా వచ్చే నగదు మాయమవడం మొదలైందని ఆయన తెలిపారు. తిరుపతి యూనిట్‌లో మొదటగా రేజెర్ పే అకౌంట్ ద్వారా కోట్ల రూపాయల డబ్బు మాయం అయ్యిందన్నారు. దానిలో 36.52కోట్ల రూపాయల నగదు ఇతర అకౌంట్‌లకు వెళ్ళిందని గుర్తించామన్నారు. మాజీ డీజీపీ బంధువులు ఈ చలానా నగదు కేసులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే రాజశేఖర్ కొత్తపల్లి అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్ట్ చేశామన్నారు. ఈ నగదు మాయం కావడం తిరుపతిలో మొదటగా బయటపడిందని ఆయన చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్ అనే అనుమానితుడి నుంచి ఆస్తులను అటాచ్ చేశామన్నారు.
Also Read: Karumuri Nageswara Rao: చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి…?
ట్రాఫిక్ ఈ-చలాన్లలో నిధుల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి… వాహనదారుల నుంచి పోలీసులు వసూలు చేసే నిధులను సొంత ఖాతాలకు డేటా ఇవాల్వ్ సొల్యూషన్స్ కంపెనీ మళ్లించుకున్నట్టు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ట్రాఫిక్ ఈ-చనాన్ల ద్వారా వచ్చిన సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించిన కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొమ్మిరెడ్డి అవినాష్.. మరోవైపు గుంటూరు కోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.. బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు.. ఈ చనాన్ల సొమ్ము పక్కదారి పట్టించిన కేసులో.. ఇవాల్వ్ సొల్యూషన్స్ కు చెందిన రాజశేఖర్ అనే ఉద్యోగిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఏపీ సంచలనంగా మారిన ఈ కేసులో లోతైన విచారణ జరిగితే.. అది ఎటువైపు దారి తీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.