అమ్మో అదో ప్రభుత్వ కార్యాలయం కానీ.. ఆ ఆఫీస్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి.. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం మాత్రం శూన్యం.. ఎక్కడో అనుకుంటున్నారు.. కదా.. మన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోనే ఇది జరిగింది.
Read Also: Share Story: రూ.3ల షేర్.. ఇప్పుడు రూ.300లు దాటింది.. కొన్నోళ్లకు పండగే
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తున్నారు. ఆఫీస్ పై పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో వారు హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు. 2016లో బీర్‌పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచి ఎంపీడీఓ ఆఫీస్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది నుంచి పెచ్చులూడటం స్టార్ట్ అయింది.
Read Also: Tomoto Price Today: దిగొస్తున్న టమాటా ధరలు.. ఇక కొనేసుకోవచ్చు! రైతుబజార్లో కిలో ఎంతంటే?
గతేడాది ఎంపీడీఓ మల్లారెడ్డి కూర్చుని ఉండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి.. వెంటనే విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ, అది అమలుకు నోచుకోలేదు. ఇక, ఎప్పుడు ఏం జరుగుతుందో అని కార్యాలయ ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఇక చేసేది లేక.. ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం మరో చోటుకు మార్చాలంటూ సమీపంలోని అంజన్న ఆలయంలో కూడా వారు ప్రార్థనలు చేశారు.