జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేస్తున్నారు. ఆఫీస్ పై పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో వారు హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు.