Money In Car Stepney: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా యంత్రాంగం తాజాగా రూ.25 లక్షలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. జార్ఖండ్, బీహార్ సరిహద్దులోని బుద్వాదిహ్ (సరౌన్) చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న వాహన తనిఖీలో గురువారం ఈ మొత్తాన్ని SST బృందం పట్టుకుంది. మొత్తం రూ.25 లక్షలతో పాటు కారు (స్విఫ్ట్ డిజైర్)ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బు అంతా కారు స్టెప్‌పాన్‌లో దాచారు. ఈ కేసులో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ నమన్ ప్రియేష్ లక్రా, గిరిడిహ్ ఎస్పీ డాక్టర్ విమల్ కుమార్‌లకు మొత్తం విషయం గురించి సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు కూడా అందజేసారు అధికారులు.
Read Also: Diabetic Cataract Problem: డయాబెటిక్ పేషెంట్లలో కంటిశుక్లం ఎంత వరకు ప్రభావితం అవుతుందంటే?
ఈ విషయమై డియోరీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సోను కుమార్ సాహు మాట్లాడుతూ.. కారులో నోట్ల కట్టను తీసుకెళ్తున్నట్లు రహస్య సమాచారం అందిందని తెలిపారు. ఈ సమాచారం తర్వాతే ప్రత్యేక బృందం పోలీసులతో చురుకుగా మారిందని, బీహార్ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టు కూడా యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఓ కారు అక్కడికి చేరుకుందని, కారును ఆపి క్షుణ్ణంగా పరిశీలించగా.. తనికలలో స్టెప్నీని చెక్ చేయగా అందులో డబ్బు మూట కనిపించింది.
Read Also: Smuggling Dolls: ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో తయారు చేసిన బొమ్మలు స్వాధీనం
ఈ విషయమై పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి మాట్లాడుతూ.. నగదు దొరకడంతో కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. విచారణలో ఈ మొత్తాన్ని దియోఘర్ నుండి రాజ్‌ధన్‌వార్‌కు తీసుకువెళుతున్నట్లు యువకుడు చెప్పాడు. ఈ విషయమై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ దర్యాప్తు బృందంలో డియోరీకి చెందిన బీడీఓ కుమార్ బంధు కచ్చప్, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సోను కుమార్ సాహు, ఏఎస్‌ఐ బుద్ధదేవ్ ఓరాన్, మేజిస్ట్రేట్ రాజేష్ బాస్కే, సురేంద్ర కుమార్ రాజేష్ తదితరులు ఉన్నారు.