పెద్దపల్లి జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో మూడింటికి మూడు సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగిరి మండల కేంద్రంలో ఈ కార్మికులు, రైతులతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి బస్సు యాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ యాత్ర కొనసాగుతోందని, కాంగ్రెస్ మేనిఫెస్టో అవహేళన చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ వివరణ ఇస్తారన్నారు.
Also Read : Sourav Ganguly: మా రోజుల్లో అప్పటి పాక్ టీమ్ ఎలా ఉండేది అంటే..?
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీ పథకాలను రాహుల్ గాంధీ పెద్దపల్లి బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు దశలవారీగా పెంచి ఇస్తామనడం హాస్యాస్పదం. గతంలో ఒకే ఒక సంతకంతో ఉచిత కరెంటు,రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ వికాసంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మండలానికో పాఠశాల ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను నేడు కేసీఆర్ ప్రభుత్వం కాపీ కొట్టింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుండి 75 సీట్లు కైవసం చేసుకుని తెలంగాణలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థికంగా తోడ్పాటు వస్తోంది.’ అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
Also Read : Tiger Nageswar Rao: టైగర్ నాగేశ్వరరావు కథ విని రవితేజ షాకింగ్ ఎక్స్ ప్రెషన్.. చేయరనుకున్నా కానీ!