Tiger Nageswar Rao Movie Director about Raviteja: టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్దమైన క్రమంలో ఆ సినిమా దర్శకుడు వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు బయట పెట్టారు. ఈ సినిమా కథ చెప్పినపుడు రవితేజ రియాక్షన్ ఏమిటి ? అని అడిగితే రవితేజ మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు, షూటింగ్ వుంది మిగతాది రేపు వింటానని చెప్పడంతో ఇంక కాల్ రాదేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన సమయానికి ఫోన్ చేశారని, వెళ్లి కథ చెప్పానని అన్నారు. క్లైమాక్స్ చెబుతుండగానే ఆయన లేచి జుట్టు ఇలా పెంచితే బావుటుందా? ఇలా లెన్స్ పెట్టుకోనా ? అని అడుగుతూ ఉండడంతో ఆయన ఆల్రెడీ కథని ఓకే చేసి ముందుకు వెళ్ళిపోయారని అర్ధమై నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిదని అన్నారు. అది చాలా ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. మీ కెరీర్ లో బడ్జెట్, స్టార్స్ ప్రకారం ఇది చాలా భారీ సినిమా కదా ? ఒత్తిడి ఫీలయ్యారా? అని అడిగితే లార్జ్ స్కేల్ సినిమాలలో హీరో, నిర్మాత అంత బలంగా నమ్మిన తర్వాత అంత ఒత్తిడి ఉండదని, రవితేజ చాలా కేర్ తీసుకున్నారని అన్నారు.
Vamsi Krishna: రూమర్స్ ఆధారంగానే టైగర్ నాగేశ్వరరావు.. ఎందుకో తెలుసా?
ఇందులో చాలా మంచి నటులను తీసుకున్నాం, హరీష్, జీషు చాలా కొత్తగా కనిపిస్తారని, అందరూ సొంత సబ్జెక్ట్ లా నమ్మి చేశారని అన్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఎక్కడా రాజీపడకూడదని ముందే అనుకున్నాం అని అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావించానని అన్నారు. ఎడిటింగ్, ప్రొడక్షన్ నేపథ్యం నుంచి రావడం పూర్తి కంట్రోల్ ఉందని, అలాంటి కంట్రోల్ మన చేతిలో ఉంటే ఎలాంటి ఒత్తిడి ఉండదని అన్నారు. హీరోయిన్ నుపూర్ పాత్ర గురించి చెబుతూ దొంగతనాలు చేసిన బంగారాన్ని అమ్మడానికి ఒక చోటు కావాలని అందుకే ఆ బెల్ట్ లోకి చాలా మంది మార్వాడీలు వచ్చారు. అలా ఓ మార్వాడీ అమ్మాయితో టైగర్ నాగేశ్వరరావు కి అనుబంధం ఏర్పడుతుందని అదే నుపూర్ పాత్ర అని అన్నారు. ఇది కల్పితం కాదని టైగర్ నిజ జీవిత కథలో ఉందని అన్నారు. ఆ పాత్రని నుపూర్ చాలా చక్కగా చేసిందని ఆయన అన్నారు.