Duddilla Sridhar Babu : వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం జరిగిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో రివ్యూ చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని, ఇరిగేషన్ అధికారులతో పోలీస్ శాఖతో జిహెచ్ఎంసి సిబ్బందితో సమావేశం నిర్వహించామన్నారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించామని, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు శ్రీధర్ బాబు. అత్యవసర పరిధిలో తప్ప బయటకి ఎవరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులందరూ కూడా ఫీల్డ్ లో ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు శ్రీధర్ బాబు. విద్యుత్తు, రహదారులు, రోడ్డు నిర్మాణాలను వెంటనే పునర్దించాలని కోరామని, రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ బృందాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించామని ఆయన తెలిపారు.
Rescue Operation: బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అంతేకాకుండా..’పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు.. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం.. ప్రతి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడారు.. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు.. విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరైనది కాదు. ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండడం వలన మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు.. ఇలాంటి సమయంలో టిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం సరికాదు. హరీష్ రావు, కేటీఆర్ బుద్ది ఇప్పటికైనా మార్చుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం తో పాటు ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొనాలి.. హరీష్ రావు కేటీఆర్ ముందుకు రండి ప్రజలపై అభిమానం ప్రేమ ఉంటే అధికారులతో కలిసి సహాయం అందించండి. ప్రధాని నరేంద్ర మోడీని కూడా రాష్ట్రం లో పర్యటించాలని ముఖ్యమంత్రి కోరాడు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఇల్లు కోల్పోయిన వారికి కలెక్టర్లు అంచనా వేసి రివ్యూ ఇవ్వాలి కోరాం.. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్టు రిపోర్టు వచ్చింది.’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Gabbar Singh4k: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోలాహాలం.. ఆల్ షోస్ హౌస్ ఫుల్స్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!