Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఏనుగుల క్యాంప్‌లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో చెన్నైకి చెందిన జ్యునేష్ (33) అనే మహిళా పర్యాటకురాలితో పాటు, ‘మార్తాండ’ అనే ఏనుగు కూడా మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కావేరీ నదిలో ఏనుగులకు స్నానం చేయిస్తున్న సమయంలో, ‘మార్తాండ’ (35), ‘కంజన్’ (26) అనే రెండు మగ ఏనుగుల మధ్య అకస్మాత్తుగా తీవ్రమైన ఘర్షణ జరిగింది. మావటిలు వాటిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పోరాటంలో ఒక ఏనుగు పట్టుతప్పి పక్కనే ఉన్న పర్యాటకురాలు జ్యునేష్‌పై పడింది. అనంతరం లేవడానికి ప్రయత్నించే క్రమంలో మార్తాండ ఆమెను తొక్కడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 4,500 కేజీల బరువున్న మార్తాండ కూడా మరుసటి రోజు మరణించింది. ఈ ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కఠిన నిబంధనలు..
ఈ ఊహించని విషాదం తర్వాత పర్యాటకుల రక్షణే ధ్యేయంగా కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల క్యాంప్‌లలో తక్షణమే కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేసింది. మంత్రి ఆదేశాల ప్రకారం పర్యాటకులు ఏనుగుల స్నాన ప్రక్రియను కనీసం 100 అడుగుల దూరం నుంచి మాత్రమే వీక్షించాలి. అలాగే భద్రతను మరింత మెరుగుపరచడానికి ఒక ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
కొత్త నిబంధనల ప్రకారం పర్యాటకులు ఏనుగుల దగ్గరకు వెళ్లడం, వాటితో అత్యంత సమీపంగా నిలబడి సెల్ఫీలు లేదా ఫోటోలు దిగడం, ఏనుగుల తొండాలను తాకడం, వాటికి స్వయంగా స్నానం చేయించడం, అరటిపండ్లు, బెల్లం, చెరకు వంటి ఆహార పదార్థాలను తినిపించడం వంటివి నిషేధించారు. పర్యాటకుల ప్రాణాల రక్షణ కోసం ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!