Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
- చైనా అద్భుత సృష్టి
- కృత్రిమ సూర్యుడు నిర్మాణం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. అతిపెద్ద సూపర్ మాగ్నెట్‌ను సిద్ధం చేసింది. కృత్రిమ సూర్యుడి నిర్మాణంతో అద్భుతాన్ని సృష్టించింది. స్వచ్ఛమైన, అపరిమిత శక్తి ఉత్పత్తి లక్ష్యంగా సాగుతున్న కృత్రిమ సూర్యుడు (Artificial Sun) ప్రాజెక్టులో కీలక విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మాగ్నెట్‌ను విజయవంతంగా నిర్మించి పరీక్షలు పూర్తి చేసినట్లు తాజాగా చైనా ప్రకటించింది. ఈ మైలురాయి 2030 నాటికి అణు సంయోగం (Nuclear Fusion) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న చైనా లక్ష్యానికి మరింత బలాన్నిచ్చినట్లైంది.
చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ టోరాయిడల్ ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ మాగ్నెట్ 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ‘D’ ఆకారంలో నిర్మించబడింది. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో నిర్మించిన అతిపెద్ద ఫ్యూజన్ రియాక్టర్ సూపర్‌కండక్టింగ్ మాగ్నెట్గా గుర్తింపు పొందింది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కృత్రిమ సూర్యుడు అంటే?
కృత్రిమ సూర్యుడు అనేది సూర్యుడిలో జరిగే అణు సంయోగ ప్రక్రియను భూమిపై కృత్రిమంగా పునరావృతం చేసే ఫ్యూజన్ రియాక్టర్. ఇందులో హైడ్రోజన్ అణువులు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కలిసిపడి అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులు ఉత్పత్తి కావు. భవిష్యత్తులో ఇది స్వచ్ఛమైన, సురక్షితమైన, దాదాపు అపరిమిత విద్యుత్ ఉత్పత్తికి మార్గం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ మాగ్నెట్
పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ మాగ్నెట్ పరిమాణం అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కోసం రూపొందించిన మాగ్నెట్ల కంటే 1.3 రెట్లు పెద్దది, శక్తి నిల్వ సామర్థ్యం మూడు రెట్లు అధికం. ఈ మాగ్నెట్ ప్రధాన పని రియాక్టర్‌లోని ప్లాస్మాను అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంతో బంధించి ఉంచడం. సుమారు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరే ప్లాస్మా రియాక్టర్ గోడలను తాకకుండా ఈ అయస్కాంత క్షేత్రం నిరోధిస్తుంది.

ఈ భారీ మాగ్నెట్‌తో పాటు అధిక ఉష్ణోగ్రత సూపర్‌కండక్టింగ్ సెంట్రల్ సోలెనాయిడ్ కాయిల్ పరీక్షలను కూడా చైనా విజయవంతంగా పూర్తి చేసింది. దీనిని ఫ్యూజన్ రియాక్టర్‌కు ‘‘గుండె’’గా అభివర్ణిస్తున్నారు. కారు ఇంజిన్‌లో స్పార్క్ ప్లగ్ ఎలా పనిచేస్తుందో.. ఇదే విధంగా ఈ కాయిల్ ప్లాస్మాను ప్రారంభించి నిరంతరం కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు కీలక సాంకేతిక వ్యవస్థలను పూర్తిగా స్వదేశీ పదార్థాలు, తయారీ సామర్థ్యాలతో అభివృద్ధి చేసినట్లు చైనా తెలిపింది. దీంతో ఫ్యూజన్ రంగంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిందని పేర్కొంది. ఆరు సంవత్సరాల పరిశోధనలో భాగంగా 47 పేటెంట్లు, 25 పరిశ్రమ ప్రమాణాలు అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
60 ఏళ్ల పాటు పనిచేసేలా రూపకల్పన
ఈ మాగ్నెట్‌ను నిర్మించడం ఇంజినీరింగ్ పరంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది మైనస్ 269 డిగ్రీల సెల్సియస్ వంటి అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో లక్ష అంపియర్లకు పైగా విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు శక్తి నష్టం లేకుండా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రపంచ రికార్డు
ఈ ఏడాది ప్రారంభంలో చైనాకు చెందిన రియాక్టర్ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర ప్లాస్మాను 1,066 సెకన్ల పాటు నిలబెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫ్యూజన్ ప్రక్రియను ఎక్కువసేపు కొనసాగించగల సామర్థ్యాన్ని ఇది నిరూపించింది. చైనా రూపొందించిన మూడు దశల ప్రణాళిక ప్రకారం.. 2027 చివరి నాటికి ‘‘బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్‌కండక్టింగ్ టోకమాక్’’ నిర్మాణం పూర్తికానుంది. అనంతరం 2030 ప్రాంతంలో ఫ్యూజన్ ద్వారా తొలి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి దశలో చైనా ఫ్యూజన్ ఇంజినీరింగ్ డెమోన్స్ట్రేషన్ రియాక్టర్ నిర్మించి, ప్రపంచంలోనే తొలి ఫ్యూజన్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అయితే ఈ విజయాలు కీలకమైనవే అయినప్పటికీ.. పూర్తి స్థాయి రియాక్టర్ నిర్మాణం, దీర్ఘకాలిక పరీక్షలు, వినియోగించే శక్తికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని నిరూపించడం వంటి సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతి సాంకేతిక పురోగతి ప్రపంచానికి కాలుష్యరహిత, అపరిమిత విద్యుత్ ఉత్పత్తి కలను మరింత చేరువ చేస్తోందని సైంటిస్టులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
合肥核聚变项目,目前已进入聚变能开发应用“三步走”战略中的第一步,2022年至2035年,完成聚变能实验堆发电示范,2030年至2040年,完成聚变工程堆发电示范,2040年至2050年,完成聚变商业堆商业应用。 https://t.co/rYQA19f8vi pic.twitter.com/YqfX23lJjE
— 小陆师傅 (@STANLEES4) March 16, 2025
- Tags
- Artificial Sun
- china
- world
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!