SriGouriPriya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SriGouriPriya: ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తెలుగమ్మాయి హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలో తన నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని, ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు తన పాత్రను ఎంతో ఆప్యాయంగా స్వీకరించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. “థియేటర్ విజిట్స్‌కు వెళ్లిన ప్రతిసారి ‘నీవి’ పాత్ర గురించి ప్రేక్షకులు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని చెప్పారు.
నటన కోసం ఎలాంటి యాక్టింగ్ స్కూల్ లేదా ప్రత్యేక శిక్షణ తీసుకోలేదని స్పష్టం చేసిన శ్రీ గౌరీ ప్రియ, భావోద్వేగ సన్నివేశాల్లో తన నుదిటి మీద నరం బయటకు కనిపించడం గురించి కూడా ఆసక్తికర విషయం వెల్లడించారు. “నాకు కోపం వచ్చినా, బాధ కలిగినా, ఎక్కువ ఆనందం వచ్చినా నుదిటి మీద నరం బయటకు కనిపిస్తుంది. నా స్నేహితులు దానికి ‘నర్వ్ గాడు’ అని సరదాగా పేరు కూడా పెట్టారు. ఆ నరం కనిపించగానే నేను కోపంగా ఉన్నానా, బాధలో ఉన్నానా అనేది వాళ్లకు వెంటనే అర్థమైపోతుంది” అని నవ్వుతూ చెప్పారు. అలాగే ఎమోషనల్ సీన్స్‌లో నిజంగా ఆ భావాన్ని అనుభూతి చెందితేనే అలాంటి సహజమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయని, తాను పాత్రలో పూర్తిగా లీనమవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?