DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Candidates: డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియామకాల్లో చోటుచేసుకున్న లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పటికీ తమకు ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు, మెరిట్ ఉన్నప్పటికీ పోస్టులు ఇవ్వకుండా తమను పక్కన పెట్టారని ఆరోపించారు. మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తమ సమస్యలను పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన లభించలేదని చెప్పారు. మంత్రి కార్యాలయం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా తమ బాధలను పట్టించుకోలేదని వాపోయారు. విద్యాశాఖ అధికారుల నుంచి కూడా సరైన సమాధానాలు రాలేదని తెలిపారు. 1:1 విధానంలో కాల్ లెటర్లు జారీ చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక పోస్టుకు ఒకరినే పిలిచిన తర్వాత కూడా నియామకం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచారని నిలదీశారు.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తమ పేర్లు ఎంపికైన వారి జాబితాలోనూ లేవని, తిరస్కరించిన వారి జాబితాలోనూ లేవని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సంబంధిత కార్యాలయాల నుంచి తమను బయటకు పంపించారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమలాంటి అభ్యర్థులకు ఈ ప్రక్రియ వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. క్రీడా కోటా పేరుతో ఎంపికైన కొందరికి బోధనా అంశాలతో సంబంధం లేని సర్టిఫికెట్లు ఉన్నాయని, అలాంటి వారు విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారికి క్రీడల సంబంధిత పోస్టులు ఇస్తే అభ్యంతరం లేదని, కానీ ఇతర సబ్జెక్టుల బోధన బాధ్యతలు అప్పగించడం విద్యా వ్యవస్థకు నష్టమని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రజాస్వామ్యంలో తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. డీఎస్సీ మెరిట్ లిస్టులను పలుమార్లు మార్చారని, కటాఫ్ మార్కులు కూడా ప్రకటించలేదని అభ్యర్థులు ఆరోపించారు. విడుదల చేసిన మెరిట్ లిస్టులను కొద్ది రోజుల్లోనే వెబ్సైట్ నుంచి తొలగించారని చెప్పారు. డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామకాల్లో జిల్లాల వారీగా జాబితాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
తమ సమస్యలను ఓపికగా విని ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 1998 డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు కూడా ఆయన అండగా నిలిచారని గుర్తుచేశారు. తమలాంటి సాధారణ అభ్యర్థులు పెద్ద పెద్ద కోర్టుల్లో న్యాయపోరాటం చేయడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే తమకు న్యాయం జరిగేలా సహకరించాలని జగన్‌ను కోరారు డీఎస్సీ అభ్యర్థులు..
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!