న్యూ ఇయర్ వచ్చేస్తోంది. మరో వారంలో కొత్త సంవత్సరం వేడుకలు రానున్నాయి. దీంతో యూత్ ని టార్గెట్ చేశారు కేటుగాళ్లు. హైదరాబాదులో మరో అంతర్జాతీయ భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు అయింది. నూతన సంవత్సర వేడుకలే టార్గెట్ గా నగరంలోకి డ్రగ్స్ తీసుకొచ్చిందో ముఠా. చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆపరేషన్ ప్రారంభించింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ తో కలిసి నార్త్ జోన్ పోలీసుల కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Trisha: డీ-ఏజింగ్ టెక్నాలజీ కూడా ఇంత అందం ఇవ్వలేదు…
డ్రగ్స్ ముఠా తెలివితేటలకు పోలీసులే తెల్లముఖం వేయాల్సి వచ్చింది. మూడు కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తరలించేందుకు ముఠా వినూత్న పద్ధతుల్ని ఆచరించింది. గాజులు, పెళ్లి బట్టలలో పెట్టి డ్రగ్స్ తీసుకొస్తుంది ముఠా. చెన్నై నుంచి పెళ్లి బృందం మాదిరిగా వేషాలు వేసుకొని హైదరాబాద్ వచ్చింది ముఠా. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. పెళ్లి బట్టలు, గాజులు, అలంకార వస్తువులలో డ్రగ్స్ పెట్టి తీసుకు వచ్చిన ముఠా గుట్టును బట్టబయలు చేశారు. తనిఖీలలో పట్టుబడిన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ జోష్ నేపథ్యంలో మరిన్ని ముఠాలు నగరంలోకి వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి అనుగుణంగా తనిఖీలు ముమ్మరం చేశారు.
తమిళనాడు లోని శివ గంగ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చింది ముఠా. వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చింది ముఠా.. ప్రతిసారి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ ని విదేశాలను పంపుతుంటుంది ఈముఠా.. ఇప్పటివరకు 21సార్లు డ్రగ్స్ ని విదేశాలకు పంపింది ఈ ముఠా. ఇప్పటివరకు 100కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాలకు సరఫరా చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు పాలు దేశాలకు డ్రగ్స్ పంపించింది ముఠా. శివ గంగలో డ్రగ్స్ ను తయారుచేసి సరఫరా చేస్తోంది ఈ ముఠా. ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంటర్నేషన కొరియర్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొరియర్ సంస్థలపై కేసులు పెట్టాం అని చందనదీప్తి తెలిపారు.
Read Also: Rachakonda New Police Stations: రాచకొండలో కొత్తగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు