డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read:Minister Komati Reddy: తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రోడ్ల నిర్మాణం !
ఆరు మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా విద్యార్ధులకు పరీక్షలు చేశారు. పట్టుబడిన వారు చివరి సంవత్సరం చదువుతున్న హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులుగా గుర్తించారు. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరిలించినట్లు తెలిపారు. విద్యార్థుల స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.