Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి విధితమే. అద్భుతమైన టీం, పవర్ ఫుల్ కొలాబరేషన్ తో ‘పెద్ది’ సినిమా భారతీయ సినిమాలలో కొత్త ప్రమాణాలను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
Read Also: Lopaliki Ra Chepta: ‘ లోపలికి రా చెప్తా’ అంటున్నారేంట్రా.. ట్రైలర్ రిలీజ్
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకి సందినుంచి తాజాగా అందిన సమాచారం మేరకు భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. స్టార్ డీవోపీగా పేరొందిన రత్నవేలు ‘పెద్ది’ సెట్స్ నుంచి ఓ ఎనేర్జిటిక్ మోమెంట్‌ను షేర్ చేశారు. గ్లోబల్ స్టార్ తో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Read Also: Euphoria: తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా: భూమిక చావ్లా
డీవోపీ రత్నవేలు షేర్ చేసిన ఆ స్టిల్ లో హీరో రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్ లో కనపడ్డాడు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలెట్ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి డివోపీ ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్. వినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. పెద్ది చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.