Kota: కోటాలో ఓ విద్యార్థి మిస్సింగ్.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్తున్నట్లు మెస్సెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్‌కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
కోటా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన రాజేంద్ర మీనా (19)గా గుర్తించారు. కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ క్లాస్‌లకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన విద్యార్థి మిస్సింగ్ అయ్యాడు. కాగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉండే పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
Mega Brothers: తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపుతున్న జనసేనాని చిన్నప్పడు ఎలా ఉండెవడో చుసారా.. ఫోటో వైరల్..
విద్యార్థి రాజేంద్ర వెళ్లిపోయేముందు.. తన తండ్రి జగదీశ్ మీనాకు ఓ మెసేజ్ పంపించాడు. “నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతున్నాను. నాకు చదువుకోవాలని లేదు. ఇప్పుడు నా వద్ద రూ. 8 వేలు ఉన్నాయి. ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్‌ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి బాధపడొద్దని. నేను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్ చేస్తా” అని తన తండ్రి జగదీశ్ మీనాకు మెస్సెజ్ పెట్టాడు.
ఈ సందేశం చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగదీశ్ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థి కోసం వెతకడం ప్రారంభించారు. కాగా, చదువులో ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఇలా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!