మెగా బ్రదర్స్ ఎంత బాగా కలిసిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి సొంతంగా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తన పెద్ద తమ్ముడిని నాగబాబును అదే రంగంలోకి దించాడు. అయితే నటుడిగా సక్సెస్ కాలేకపోయినా.. కానీ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ గా అభిమానులకు దగ్గరైన ఆయన జనసేనానిగా జనాలకు చేరువయ్యారు. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములు చిన్నప్పుడు ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read: Shocking Incident: ఇంటికి తీసుకెళ్లే మార్గంలో 10వ తరగతి విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు..
ఆ ఫోటోలో చిరు బ్లాక్ డ్రెస్ వేసుకుని నిలబడగా.. నాగ బాబు తెల్ల చొక్కా, నలుపు ప్యాంటు ధరించి ఫోటోకి పోజులిచ్చాడు. ఇక చిరు చెల్లెలు, సాయి ధరమ్ తేజ్ అమ్మ సంప్రదాయ చీరలో కనిపిస్తే, పవన్ కళ్యాణ్ నిక్కర్ వేసుకొని చాలా క్యూట్ గా కనిపించారు. దీనిపై మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ.. అందరి డ్రెస్ ల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ చిన్న నిక్కర్ లో ఉండటం అందరిని ఆకర్షిస్తుంది.