పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అఘాయిత్యాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రధాని మోడీపై సీఎం మమత విరుచుకుపడ్డారు. బొంగావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా లేదని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ మహిళల ఆత్మగౌరవంతో ఆడవద్దని, మా అమ్మానాన్నల గౌరవంతో ఆడుకుని కుట్ర పన్నవద్దని ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ తన గత అకృత్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆదివారం బహిరంగ సభలో ప్రధాని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Attack On TTE: టికెట్ అడిగినందుకు టీటీఈ పై దాడి.. చివరకు..
మరోవైపు.. ఉత్తర 24 పరగణాల వంటి సరిహద్దు జిల్లాల్లో రాష్ట్ర అధికార పార్టీ కార్యకర్తలను భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర బలగాలను ఉపయోగిస్తోందని టీఎంసీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీని అమలు చేయడానికి అనుమతించబోమని సీఎం మమత మరోసారి పునరుద్ఘాటించారు. అయితే.. బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తామని ప్రధాని మోడీ నిన్న చెప్పారని.. అయితే మేము దానిని అంగీకరించడం లేదని అన్నారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Covid 19: మహారాష్ట్రలో కొత్త కోవిడ్ సబ్ వేరియెంట్ తో 91 కేసులు నమోదు..
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుస్తుందని టీఎంసీ అధిష్టానం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందన్నారు. అయితే, బెంగాల్‌లో తాము ఒంటరిగా బీజేపీతో పోరాడుతున్నామని తెలిపారు. మరోవైపు.. మహిళల కోసం రాష్ట్ర ఆర్థిక సహాయ పథకం ‘లక్ష్మీ భండార్’ను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం బెనర్జీ ఆరోపించారు.