ఆఫీస్ లైఫ్ లో ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి చాలారోజుల పాటు వస్తే.. చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే వెన్నునొప్పితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకని వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అయితే వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది. అయితే.. ఈ నొప్పి దీర్ఘకాలికంగా మారితే మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు ఉండవచ్చు.
Pothula Sunitha Strong Warning: పవన్‌కు ఇదే మా వార్నింగ్.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?
కొందరిలో కిడ్నీ స్టోన్‌లో వెన్ను కింది భాగంలో నొప్పి వస్తుంది. వీపు కింది భాగంలో తీవ్రమైన లేదా అడపాదడపా నొప్పి వల్ల మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు ఆరోగ్య సమస్యగా ఏర్పడుతుంది. దాంతో బోలు ఎముకల వ్యాధిలో ఎముక పగుళ్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధి ఎక్కువగా 50 ఏళ్ల తర్వాత మాత్రమే కనిపిస్తుంది. బోలు ఎముకల వ్యాధి పెరుగుదలతో తీవ్రమైన నొప్పి సమస్య ఉంటుంది. అందువల్ల, వెన్నునొప్పితో ఇబ్బంది పడితే వైద్యుడిని సంప్రదించాలి.
Nani : తన తరువాత సినిమా పై అప్డేట్ ఇచ్చిన నాని..
ఎవరికైనా వెన్నెముక స్టెనోసిస్ ఉన్నప్పుడు.. ఈ స్థితిలో వెన్నెముక కాలువలు సంకుచితం అవుతాయి. దీని కారణంగా నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్పైనల్ స్టెనోసిస్ మెడ నొప్పి నుండి వెన్నునొప్పి మరియు చేతులు మరియు కాళ్ళలో బలహీనత ఉంటుంది.