నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.ఈ మధ్య వరుస వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాని రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. దసరా సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా 110 కోట్ల కు పైగానే వసూళ్లను సాధించి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక నాని ఈ సినిమా తరవాత తన 30వ సినిమాను అధికారికంగా ప్రకటించి షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టేసాడు.ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యన్ తెరకెక్కిస్తున్నారు.మృణాల్ ఠాకూర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది..శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్ర ను పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి అయినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే నాని మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా నాని సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ ను షేర్ చేసారు.. ఈ సరికొత్త పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.రెడీ…? అంటూ థియేటర్ లో క్లిక్ చేసిన పిక్ ను నాని షేర్ చేసారు. మరి ఈ పిక్ చూస్తుంటే నాని తన తరువాత చేయబోయే సినిమా కు సంబంధించిన అప్డేట్ అని తెలుస్తుంది.. దీన్ని బట్టి అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ లేదా టీజర్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.ఇక నాని 30వ సినిమాను వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాకు విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు..
https://twitter.com/NameisNani/status/1678015211167694850?s=20